Opposition letter to Modi: ప్రధాని మోదీకి 9 మంది ప్రతిపక్ష నేతల లేఖ.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition letter to Modi:కేంద్ర సంస్థల దుర్వినియోగంపై 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తమ నేతలను ఇరికించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు లేఖలో ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లను నేతలను ఇరికించేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
Also Read
లేఖలో సంతకాలు చేసిన నేతల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత చంద్రశేఖర్ రావు, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. 2014 నుంచి బీజేపీ హయాంతో కేసులు నమోదు చేసినవారిలో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.
బీజేపీలో చేరిన ప్రతిపక్షాల నేతలపై కేసుల దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని పలు ఉదాహరణలను పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై 2014, 2015లో శారద చిట్ ఫండ్ స్కామ్ లో సీబీఐ, ఈడీలు విచారణ జరిపాయని, అయితే బీజేపీలో చేరిన తర్వాత కేసులో పురోగతి లేదని, ఇదే విధంగా నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో మాజీ టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి, ముకుల్ రాయ్ లపై ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని.. అయితే ప్రస్తుతం ఈ కేసుల్లో కదలిక లేదని లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!