New Political Front: కాంగ్రెస్ లేకుండా మమతా-అఖిలేష్ కొత్త ఫ్రంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee-Akhilesh Yadav New Front Without Congress: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు తమ ఎన్నికల ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ చీఫ్ మమతా బెనర్జీని కోల్‌కతాలో కలిశారు. ఇరువురు నేతల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా కొత్త రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేసేందుకు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ అంగీకరించారు. మరోవైపు వచ్చే వారం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ ను కలవనున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష కూటమికి కీలక నేతగా చూపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బెంగాల్ లో మేము దీదీ వెంటే ఉన్నాము, ప్రస్తుతం మా స్టాండ్ బీజేపీకి, కాంగ్రెస్ కు సమాన దూరాన్ని పాటించడమే అని, బీజేపీకి అనుకూలంగా ఉండే వారికి సీబీఐ, ఈడీ, ఐటీ నుిచి ఏం కాదని అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత దర్యాప్తు సంస్థలు కేసులు ఎత్తేస్తున్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
Read Also: Sonali Kulkarni: అమ్మాయిలకు అది ఎక్కువైంది.. అవసరాలు తీర్చే బాయ్ ఫ్రెండ్ కావాలి
రాహుల్ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని, రాహుల్ గాంధీని ఉపయోగించుకుని సభను నడపాలని అధికార బీజేపీ కోరుకోవడం లేదని, రాహుల్ గాంధీనే 2024 ఎన్నికల్లో విపక్షాలకు ప్రధాని అభ్యర్థిగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని, ప్రధాని ఎవరన్నది నిర్ణయించాల్సిన అవసరం లేదని త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు.
విపక్షాలకు కాంగ్రెస్ బిగ్ బాస్ అని అనుకోవడం అపోహే అని ఆయన అన్నారు. మార్చి 23న మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ భేటీ అవుతారని, కాంగ్రెస్, బీజేపీకి దూరంగా ఉంటే కొత్త ఫ్రంట్ గురించి ఆలోచిస్తామని, అయితే దీన్ని థర్డ్ ఫ్రంట్ గా చెప్పడం లేదని, ప్రాంతీయ పార్టీల బలాన్ని బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టే ప్రయత్నం అని అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!