Mamata Banerjee criticizes BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును బీజేపీ తన పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగిస్తోందిని మంగళవారం దీదీ ఆరోపించారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ షేర్ మార్కెట్ భారీ పతనానికి కారణం అయిందని విమర్శించారు.
Read Also: INDvsAUS Test: భారత్-ఆసీస్ చివరి టెస్టుకు మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని!
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే షేర్ మార్కెట్ భారీ పతనానికి గురైందని.. అనేక వేల కోట్ల రూపాయలను పంపింగ్ చేయాలంటూ కొంతమందికి ఫోన్ కాల్స్ వెళ్లాయని ఆమె అన్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ అన్ని అబద్ధాలతో నిండి ఉందని అభివర్ణించారు.
ఇదిలా ఉంటే బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆపేందుకు రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు ప్రయత్నించారని.. ఇప్పుడు బుల్లెట్ రైలు పనులు వేగంగా జరుగుతున్నాయని బీజేపీ విమర్శించింది. గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆగిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని బీజేపీ ఆరోపించింది. దేశాన్ని పురోగమించకుండా చేసి సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే మిగిలిపోతారంటూ మండిపడింది.