Suvendu Adhikari: “మమతా బెనర్జీ ప్రధాని కాగలదు”.. అమర్త్యసేన్ వ్యాఖ్యలపై సువేందు అధికారి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari slams Nobel laureate Amartya Sen: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ పై మండిపడ్డారు బీజేపీ నాయకుడు, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి. ఇటీవల అమర్త్యసేన్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రధాని కాగలిగే సత్తా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు బెంగాల్ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. సువేందు అధికారి ఆయనపై బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మహమ్మారి దేశాన్ని తాకినప్పుడు అమర్త్యసేన్ ఎక్కడు ఉన్నారని.. 2021 ఎన్నికల తరువాత బెంగాల్లో జరిగిన హింసలో హిందువులు మరణించినప్పుడు అమర్త్య సేన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
Read Also: CM KCR: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధు, ఉచిత కరెంటు
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
ఇంతకుముందు శారదా చిట్‌ఫండ్ నిందితుడు సుదీప్తో సేన్ మమతా బెనర్జీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు, ఇప్పుడు అమర్త్యసేన్ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు అని సువేందు అధికారి ఎద్దేవా చేశారు. 2019లో కూడా అమర్త్యసేన్ ఇలాగే మాటలు చెప్పారని.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్లను గెలుచుకుందని.. 2019కి ముందు నరేంద్రమోదీ ప్రధాని కాలేరని అమర్త్యసేన్ అన్నారని.. అయితే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చాయని ఆయన అన్నారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ అధికారంలోకి రాకముందు, ఆయన ప్రధాని కావడం ఇష్టం లేదని అమర్త్యసేన్ చెప్పారని, మోడీ పాలన విధానాన్ని విమర్శిస్తూ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో.. గుజరాత్ మోడల్ బాగానే ఉండవచ్చు కానీ మోదీ మైనారిటీలకు, మెజారిటీలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారని సువేందు అధికారి గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో మోదీకి ఎక్కువ సీట్లలో గెలుస్తారు.. అమర్త్యసేన్ పక్షపాతంతో ఇలా మాట్లాడకూదని అన్నారు. ఆయన విదేశాల్లోనే ఉండనివ్వండి.. ఆయన సలహాలు భారత్ కు అవసరం లేదు, సలహాలు ఇవ్వాల్సి వస్తే ఆయన ఆలోచనల్ని తాలిబాన్ వంటి ఇతర దేశాలలకు అందించండి అంటూ సువేందు ఘాటు విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!