Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!
- బ్యాటర్లకు స్వర్గధామంగా ఐపీఎల్
- ప్రతి సీజన్‌లో భారీ స్కోర్లు, రికార్డుల వర్షం
- ఐపీఎల్ చరిత్రలో అగ్రస్థానం 'కింగ్'దే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Runs in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్‌లో బ్యాటర్లకు స్వర్గధామంగా భావించబడుతుంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా.. ప్రతి బ్యాటర్ విరుచుకుపడుతుంటాడు. ఈ క్రమంలో ప్రతి సీజన్‌లో భారీ స్కోర్లు, రికార్డుల వర్షం కురుస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం. ఇప్పటి వరకు జరిగిన సీజన్లను పరిశీలిస్తే.. టాప్-10లో నిలిచిన ఆటగాళ్లు అందరూ దిగ్గజాలే ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కింగ్ 267 మ్యాచ్‌ల్లో 8661 పరుగులు చేశాడు. రన్ మెషీన్‌గా పేరొందిన కోహ్లీ నిరంతర ప్రదర్శనతో ఈ రికార్డును నెలకొల్పాడు. రెండో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 272 మ్యాచ్‌లలో 7046 పరుగులు చేశాడు. మూడో స్థానంలో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ నిలిచాడు. గబ్బర్ 222 మ్యాచ్‌ల్లో 6769 రన్స్ బాదాడు. ధావన్ తన స్థిరమైన ఆట శైలి ఐపీఎల్‌లో టాప్ బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టింది.
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
Also Read: Divyang Shakti Scheme: నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం!
నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. 184 మ్యాచ్‌లలో 6565 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (205 మ్యాచ్‌ల్లో 5528) పరుగులతో నిలిచాడు. రైనా ఐపీఎల్‌లో అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఆరవ స్థానంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. మహీ 278 మ్యాచ్‌లలో 5383 పరుగులు చేశాడు. తన ఫినిషింగ్ స్టైల్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పే ధోనీ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఏడో స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ (5162) ఉన్నాడు. అతని వినూత్న షాట్లు అభిమానులను ఎప్పటికీ అలరిస్తాయి. కేఎల్ రాహుల్ (5054), క్రిస్ గేల్ (4965), రాబిన్ ఉతప్ప (4952)లు టాప్-10 జాబితాలో ఉన్నారు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!