పశ్చిమ బెంగాల్లోని స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణంపై ఇవాళ (సోమవారం) తీర్పు వెలువరిస్తూ కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ 2016 నాటి మొత్తం ప్యానెల్ను రద్దు చేయాలని ఆదేశించింది.
ఈద్ జరుపుకునేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లొద్దని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. మీరు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకుంటే కాషాయ పాలకులు మీ ఆధార్ కార్డు, పౌరసత్వాన్ని తీసేస్తారని పేర్కొన్నారు.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. రామ నవమి రోజు బీజేపీ అల్లర్లు చేయాలని చూస్తోందని, ప్రజలను రెచ్చగొట్టాలని భావిస్తోందని బుధవారం ఆరోపించారు.
West Bengal: బెంగళూర్లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అయితే ఈ పరిణామం బెంగాల్లో రాజకీయ రచ్చకు దారి తీసింది.
Mamata Banerjee: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సి), యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని, పారామిలిటరీ బలగాలను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ గురువారం పశ్చిమబెంగాల్లోని కూచ్ బీహార్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షులైతే.. తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.