Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!
- ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం..
- ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
- మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా..
- తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని బెంగాలీ స్క్వేర్ సమీపంలో ఉన్న మూడు అంతస్తుల నివాస భవనంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఇంటి బయట పార్క్ చేసిన ఎలక్ట్రిక్ వాహనంలో పేలుడు సంభవించడం వల్ల అగ్ని ప్రమాదం ప్రారంభమైనట్లు తెలిపారు. వాహనం చార్జింగ్ పాయింట్ వద్ద జరిగిన పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.
Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ఇంట్లో సుమారు 10 ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉండగా, వాటిలో కొన్ని పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. అగ్ని ప్రమాదం సమయంలో వరుసగా రెండు నుంచి మూడు పేలుళ్లు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భవనంలో మూడు అంతస్తుల్లో ప్రజలు నివసిస్తున్నారు. అయితే, ఎలక్ట్రానిక్ లాకింగ్ వ్యవస్థ కారణంగా బయటకు రావడం కష్టమైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలుపులు తెరుచుకోకపోవడం వల్ల లోపల ఉన్నవారు చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఫైర్ సిబ్బంది, అత్యవసర బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. పక్కనే ఉన్న భవనం ద్వారా లోపలికి ప్రవేశించి కొంతమందిని బయటకు తీసుకొచ్చారు. ముగ్గురిని సురక్షితంగా రక్షించినప్పటికీ, ఆరుగురిని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పొగ పీల్చడం వల్లే ఎక్కువ మంది మృతి చెందినట్లు వెల్లడైంది.
ఈ ప్రమాదంలో మధ్య అంతస్తు పూర్తిగా దెబ్బతినగా, భవనం కొంత భాగం పూర్తిగా దెబ్బ తినింది. ఈ ఇల్లు పాలిమర్ వ్యాపారి మనోజ్ పుగాలియాకు చెందినదిగా గుర్తించారు. ఎల్పీజీతో పాటు ఇతర మండే పదార్థాలు కూడా ఇంట్లో ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను విజయ్ సేథియా (65), చిన్నూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ పుగాలియా (65), సిమ్రన్ (30), రాశి సేథియా (12), టిను (35)గా గుర్తించారు. గాయపడిన సౌరభ్ పుగాలియా (30), ఆశిష్ (30), హర్షిత్ పుగాలియా (25) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!