Mamata Banerjee: హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడి పడిన మమతా బెనర్జీ.. మళ్లీ గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడింది. దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతున్న టైంలో ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో స్వల్ప గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దీదీ దుర్గానగర్‌కి వెళ్లారు. అక్కడ సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి మరో చోటకు వెళ్లాల్సిన ఉండగా.. హెలికాప్టర్ అప్పటికే రెడీగా ఉంది.. వేగంగా నడుచుకుంటూ వచ్చిన మమతా మెట్లు ఎక్కారు. లోపలి వరకూ బాగానే వెళ్లిన ఆమె.. అక్కడ కుర్చీలో కూర్చునే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Nandyala: డిజిటల్ పేమెంట్స్ ఉంటేనే మద్యం
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
మమతా బెనర్జీ పడిపోవడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెని పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకి స్వల్ప గాయం అయినట్టుగా తెలుస్తుంది. ఆ తరవాత ఆమె షెడ్యూల్ ప్రకారం అసన్సోల్‌లోని టీఎంసీ నిర్వహించే బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే, ఇటీవలే ఆమె గాయపడి కోలుకున్నారు. కోల్‌కత్తాలోని ఇంట్లోనే మమతా బెనర్జీ జారి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె తలకి తీవ్ర గాయమైంది. రక్తం కారుతున్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. అంతకు ముందు 2023 జూన్‌లోనూ దీదీకి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా హెలికాప్టర్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అది ల్యాండ్ అయిన సమయంలోనే ఆమె కాలికి గాయమైన విషయం తెలిసిందే.
#WATCH | West Bengal CM Mamata Banerjee slipped and fell while taking a seat after boarding her helicopter in Durgapur, Paschim Bardhaman today. She reportedly suffered a minor injury and was helped by her security personnel. She continued with her onward travel to Asansol. pic.twitter.com/UCt3dBmpTQ
— ANI (@ANI) April 27, 2024
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!