Amit Shah: సీఏఏపై మమతకు వచ్చిన ఇబ్బందేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సెకండ్ విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. సెకండ్ ఫేజ్‌లో జరిగే స్థానాల్లో బుధవారం ప్రచారం ముగియనుంది. దీంతో నేతలు స్పీడ్ పెంచారు. విమర్శల దాడి కూడా హీటెక్కిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: PM Modi: ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు.. మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి 17,000 మంది లేఖ..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
కాంగ్రెస్‌కు కానీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే.. మీకు వచ్చిన సమస్య ఏంటని నిలదీశారు. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే.. సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మోడీ మళ్లీ ప్రధానిగా కావాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Lok sabha election: 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ ఎఫెక్ట్.. 26న పోలింగ్ తగ్గనుందా?
గత ఎన్నికల్లో 18 సీట్లు ఇచ్చారని.. ప్రతిగా మోడీ రామమందిరం తీసుకువచ్చారని అమిత్ షా గుర్తుచేశారు. ఈసారి 35 సీట్లు ఇస్తే.. చొరబాట్లను ఆపేస్తారన్నారు. తన ఓటు బ్యాంక్‌పై దృష్టిపెట్టిన మమతాబెనర్జీ.. సందేశ్‌ఖాలీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడన్నారు. ఈసారి తమ లక్ష్యం 35 లోక్‌సభ స్థానాలు సాధించడమని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పదేళ్ల క్రితం వరకు టీఎంసీ నేతలు చిన్నపాటి ఇళ్లల్లో ఉండేవారని.. సైకిల్ మీద తిరిగేవారన్నారు. కానీ ఇప్పుడు నాలుగు అంతస్తుల భవనాల్లో నివసిస్తూ.. కార్లలో చక్కర్లు కొడుతున్నారని తెలిపారు. అందంతా ప్రజల సొమ్మేనంటూ అమిత్ షా విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..