మలక్ పేటలో ఉదయం వాకింగ్ కు వెళ్లిన చందునాయక్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను సౌత్ ఈస్ట్ డిసిపి సాయి చైతన్య వెల్లడించారు. సాయి చైతన్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “పాత కక్షల కారణంగా చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.. ఉదయం 7:30 గంటలకు కాల్పుల ఘటన జరిగింది.. చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు…
హైదరాబాద్ మలక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద దారుణం చోటుచేసుకుంది. శాలివాహన నగర్ పార్కు దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు కారులో వచ్చి చందు రాథోడ్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపి పారిపోయారు. చందు రాథోడ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సీపీఐ నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి హత్య చేశారు ప్రత్యర్థులు. స్నేహితుల తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్…
మలక్ పేటలోని శాలివాహన నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ కు వెళ్లిన వారిపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. చందు నాయక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపారు గుర్తు తెలియాలని వ్యక్తులు.. అతను స్పాట్లోనే చనిపోయాడు. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట వాసి. కాల్పులకు కారణం భూ వివాదం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వాకర్స్ పై కాల్పులు జరపడంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన…
Theft : ఒకే రోజు.. మూడు చోరీలు… పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. కానీ పోలీసులు మాత్రం ఊరికే ఊరుకుంటారా..? జస్ట్ 24 అవర్స్‌లో ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కటకటాల్లోకి నెట్టారు. ఇది హైదరాబాద్ మలక్‌పేట్ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్‌లో రోజు రోజుకు చోరీలు పెరుగుతున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు.. మలక్‌పేట్ ప్రాంతంలో ఒకే రోజు మూడు చోరీలు జరిగాయి. దీంతో ఈ చోరీలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.…
Sirisha Murder Case: మలక్ పేటలో శిరీష హత్య కేసులో సరిత క్రూరత్వంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రొఫైల్ పిక్ లో ఆమె అసలు రంగు బయటపడింది. నన్ను తట్టుకుని నిలవాలంటే మూడే దారులు.. మారిపోవాలి, పారిపోవాలి, లేదా సచ్చిపోవాలి అంటూ సవాల్.. నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా అని పోస్టులో సరిత పేర్కొనింది.
హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష్ హత్య కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషాను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే శిరీషను చంపినట్లుగా పోలీసులు తేల్చారు.
Breaking News: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద 60 కేజీల గంజాయిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో గంజాయి తరలింపు జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు, అక్కడే గట్టి నిఘా పెట్టి దాడి నిర్వహించారు. దాడి సమయంలో 60 కేజీల గంజాయిని…
Police Constable:భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను భార్యతో తరచూ గొడవపడేవాడు. నాలుగైదు రోజులుగా…
హైదరాబాద్‌లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఓ కన్సుల్టెన్సీ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. అయితే... హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు కూల్చివేతలు చేపటటారు. మూసీ రివర్ బెడ్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. మలక్‌పేట పరిధిలోని శంకర్ నగర్లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.