Theft : హైదరాబాద్‌లో రోజు రోజుకు పెరుగుతున్న చోరీలు
- ఒకే రోజు మూడో చోరీ.. పోలీసులకు సవాల్
- సీసీటీవీ ఆధారాలతో 24 గంటల్లో ముగ్గురు దొంగల అరెస్ట్
- ఆర్థిక కష్టాలు, జల్సాలు.. దొంగతనానికి దారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theft : ఒకే రోజు.. మూడు చోరీలు… పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. కానీ పోలీసులు మాత్రం ఊరికే ఊరుకుంటారా..? జస్ట్ 24 అవర్స్‌లో ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కటకటాల్లోకి నెట్టారు. ఇది హైదరాబాద్ మలక్‌పేట్ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్‌లో రోజు రోజుకు చోరీలు పెరుగుతున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు..
మలక్‌పేట్ ప్రాంతంలో ఒకే రోజు మూడు చోరీలు జరిగాయి. దీంతో ఈ చోరీలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ మూడు చోరీలు కూడా ఢిఫరెంట్ స్టైల్‌లో జరిగాయి. కారు డిక్కీలో ఓ వ్యక్తి డబ్బు చోరీ చేశాడు. మరో ఘటనలో స్కూటర్ డిక్కీ నుంచి డబ్బు, చెక్ పుస్తకాలు కొట్టేశాడు మరో వ్యక్తి. ఇక ఓ సెల్‌ఫోన్ షోరూమ్ గోడకు రంధ్రం చేసి మరీ లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లు ఎత్తుకుని పారిపోయాడు ఓ దొంగ..
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
ఇక్కడ చూడండి.. బురఖాలో ఉన్న ఇతని పేరు మహమ్మద్ వాజిద్. గతంలో మలక్‌పేట్ గంజ్‌లో ఉల్లిపాయ వ్యాపారి షేక్ ఖుద్దూస్ వద్ద పని చేసి మానేశాడు. ప్రస్తుతం టాటా ఏస్ డ్రైవింగ్ చేస్తున్నాడు. రియాసత్ నగర్ ఓవైసీ కాలనీకి చెందిన వాజిద్.. బురఖా ధరించి వచ్చి స్కూటర్ డిక్కీలో దాచి ఉంచిన 6.50 లక్షల నగదుతోపాటు చెక్ బుక్ ఎత్తుకుని వెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ, కార్మికులు ఇచ్చిన ఆధారాల ఆధారంగా కేసు ఛేదించారు పోలీసులు. మహమ్మద్ వాజిద్‌ని నిందితుడిగా గుర్తించారు. అతని నివాసం నుంచి అరెస్టు చేశారు. ఆర్థిక సమస్యలు, కారు కొనాలనే కోరిక కారణంగా నిందితుడు దొంగతనం చేశాడని విచారణలో తేలింది…స్పాట్..
ఇక్కడ చూడండి.. ఇది దిల్‌సుఖ్ నగర్‌లోని బిగ్ సీ సెల్‌ఫోన్ షో రూమ్. ఈ గోడకు రంధ్రం చేసి.. అర్ధరాత్రి దొంగ లోపలికి ప్రవేశించాడు. లక్షల రూపాయల విలువ చేసే ఫోన్లు ఎత్తుకుని పోయాడు. అతడు చోరీ చేసిన సమయంలో సీసీ కెమెరాలు ఆన్‌లోనే ఉన్నాయి. వాటిల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా అతన్ని రంజన్ దాస్‌గా గుర్తించారు పోలీసులు. మద్యానికి బానిసయ్యాడు. అతనికి ఇల్లు లేదు. నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఫుట్ పాత్‌పై నివసిస్తున్నట్లు గుర్తించారు. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికతో చోరీలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు.. స్పాట్..
డీసీపీ చైతన్య కుమార్ మాట్లాడుతూ.. ఆర్ధిక అవసరాలు, జల్సాలు.. విలాసవంతమైన జీవితం కోసం ఎవరు దొంగతనం చేసినా అది నేరమే అవుతుంది. అలాంటి హైఫై జీవితం గడపాలంటే కష్టపడి డబ్బు సంపాదించాలి తప్ప ఇలాంటి నేరాలకు అలవాటు పడితే జైలులో జీవితం గడపాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!