సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్‌తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా రైల్లో ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం…
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లా?” అని ప్రశ్నించారు. ప్రజలు తమ వెంటే ఉన్నప్పుడు, కాంగ్రెస్ బలంగా కొనసాగుతున్న సమయంలో, గ్రాఫ్ తగ్గిపోతుందన్న అభిప్రాయం అసత్యమని ఖండించారు. ఫామ్ హౌజ్‌లో కూర్చొని పెన్ను, పేపర్ తీసుకుని గ్రాఫ్ గీస్తే, కాంగ్రెస్…
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయంలో 14 వేల మందికి శిక్షణ ఇచ్చారు.. ఇంకా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ.. ఇప్పుడు తమపై దాడులు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా ఉన్న తమకు ప్రభుత్వ గుర్తింపు కావాలంటూ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు.
GHMC: హైదరాబాద్ గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతుతో కలిసి 22 మంది కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమయ్యారు. రెండు రోజుల క్రితం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమైన కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఇంకా ఫ్లోర్…
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ…
TPCC Mahesh Goud : మహేశ్వరం గట్టుపల్లిలో తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ క్రాంతి బూనియాది ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం యూత్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు టీపీసీసీ చీఫ్. మూడు రోజుల పాటు శిక్షణ శిబిర కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..…
EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు.. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక…
Mahesh Kumar: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ గ్రామంలోని ఓ ప్రైవేటు హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో అవినీతి, రాజకీయ సమస్యలపై స్పందించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు? గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా,…