హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయంలో 14 వేల మందికి శిక్షణ ఇచ్చారు.. ఇంకా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ.. ఇప్పుడు తమపై దాడులు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా ఉన్న తమకు ప్రభుత్వ గుర్తింపు కావాలంటూ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ సభకు వెళ్లాలని ఉదయానే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడితే సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Read Also: Pushpa 2 : పుష్ప- 2 లేటెస్ట్ కలెక్షన్స్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్
తనకు చిన్నప్పుడు గాయమైతే ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం చేశారు.. అప్పుడు వైద్య సిబ్బంది లేరని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను నెరవేర్చడంలో తాము ముందుంటామని పేర్కొన్నారు. 2008లో ప్రజల మనిషిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీల కోసం అప్పుడు జీవో తీసుకొచ్చారని అన్నారు. కొంతమంది వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయడం వల్ల వైద్యం వికటించి చనిపోతున్నారు అలాంటివి అరికట్టాలని తెలిపారు. మరోవైపు.. పదేళ్ళు ప్రాధమిక వైద్యాన్ని బీఆర్ఎస్ మంటగలిపిందని ఆరోపించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తున్నాం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
Read Also: Summer: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో..!
పదేళ్లపాటు కనీసం బాధలను చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.. తప్పకుండా సీఎం రేవంత్, తాను, కోదండరాం.. అందరం కలిసి చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. లక్షల వేలకోట్ల అప్పులతో వాటికి వడ్డీలు కట్టుకుంటూ.. రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ప్రభుత్వం పనిచేస్తున్నామని అన్నారు. కుల సర్వే చేశాం.. భారతదేశంలో ఎక్కడ జరగలేదు, తెలంగాణలో జరిగిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందని అభిప్రాయపడ్డారు. మంచి పని చేయాలన్నా చట్టబద్దత ఇవ్వాలి.. అందుకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. మీ పై జరుగుతున్న దాడులపై కూడా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. మంత్రితో చర్చిస్తాం..
కేసులు ఎత్తేవేసే దిశగా ప్రయత్నం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.