Kaleshwaram Commission : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నేరుగా తప్పుబట్టారు. “కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ స్పష్టంగా చెప్పింది – కేసీఆర్ దోషి. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు,” అని ఆరోపించారు. ఇంజనీర్లు సూచించిన సాంకేతిక అంశాలను పక్కన పెట్టి, తన స్వార్థ…
TPCC Mahes Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడం, వారి సమస్యలు తెలుసుకోవడం అని ఆయన స్పష్టంగా తెలిపారు. “మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పాదయాత్రను ప్రారంభించాం. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. ప్రజల జీవితాల్లో ఎదురవుతున్న వాస్తవాలను నేరుగా తెలుసుకోవడానికి,…
Meenakshi Natarajan Padayatra Schedule: జులై 31 నుంచి ఆగస్టు 6వరకు పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పరిగి నియోజకవర్గం నుంచి మొదలై వర్ధన్నపేట వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల…
Mahesh Kumar Goud: ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలపై చర్చించామన్నారు. అలాగే తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయ బద్దంగా చేసిన తీరుపై పార్టీ అగ్ర నేతలకు వివరించామని, రెండు గంటలపాటు సమావేశం జరిగిందన్నారు. Mallikarjun Kharge: తెలంగాణ సర్వే నిర్వహించిన పద్ధతి…
మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు.
TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వెంటనే తనపై అర్బన్ నక్సలైట్, దేశద్రోహి ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. గురువారం సీపీఐ మఖ్దూమ్ కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, మఖ్దూమ్ తెలుగు నేలపై జన్మించిన గొప్ప కమ్యూనిస్టు నేత అని కొనియాడారు.…
MLA Payal Shankar: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా లెటర్ రాసిందా, జాగృతి నాయకురాలుగా రాసిందా అని ప్రశ్నించారు. మేము బీసీల కోసం వాగ్దానం చేసిన రోజు కవిత తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అని ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచారు తెలంగాణ అధికారులు. ప్రభాకర్రావు విచారణ కొనసాగుతున్న క్రమంలో... ఇక ఏ మాత్రం ఆలస్యం కానివ్వకూడదని భావిస్తోందట ప్రభుత్వం. అటు బాధితులు...ఇటు సాక్షులను విచారిస్తోంది సిట్ బృందం.
Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఈ తరహా అంశాలను కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని ముందుగానే మీడియాకు వెల్లడి చేయడం సరైంది కాదని…