కర్నాటకలోని బెల్గాంలో జరుగుతున్న సీడబ్ల్యుసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో.. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లకు దక్కింది.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్ తమకు దేవుడు లెక్క అని, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. Also…
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్‌గా ఫోకస్ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.... ఏం జరుగుతుందో లోక్‌సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?
జగిత్యాలలో మైనర్ బాలిక మిస్సింగ్ .. 24 గంటలు అయినా దొరకని ఆచూకీ జగిత్యాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపింది. 24 గంటలు అయినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని విజ్‌డమ్ హైస్కూల్ హాస్టల్లోనే ఇబ్రహీం పట్నంకు చెందిన బాలిక పదవ తరగతి చదువుకుంటుంది. నిన్న మధ్యాహ్నం భోజన…
కులగణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం ఉన్న చోటే పార్టీ బలంగా ఉండాలని హైకమాండ్ చెప్పిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం పై, పార్టీ ముఖ్యనేతలతో విస్తృత చర్చ జరగాలని, ఆచితూచి కమిటీ వెయ్యాల్సిన అవసరం ఉంది. సమర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తాం అని మహేష్ గౌడ్ అన్నారు.
నుడా చైర్మన్ అభినందన సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయం సువర్ణ మయం కాబోతుందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఇంట్లో నియామకాలు చేసుకున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు ఏం చేశారని కేంద్ర మంత్రులు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వమని, ఉనికి కోసం బి.అర్.ఎస్. గ్రూప్ _1 అభ్యర్థులను రెచ్చగొట్టిందన్నారు…
Mahesh Kumar Goud: సుప్రీంకోర్టు తీర్పు తో విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్ అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. రాత్రి 8:30 గంటల సమయంలో.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నట్లు చూశారు. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్…