MLC Nominations: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్‌ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్ దాఖలు చేసారు.
Read Also: Minister Nadendla Manohar: పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా.. వర్మ విషయం టీడీపీ అంతర్గతం..!
ఇక ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ (PCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ (CPI) నేతలు హాజరయ్యారు. అలాగే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలికింది ఎంఐఎం పార్టీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఒక అభ్యర్థి మాత్రమే పోటీలో ఉండటంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే.