Mahesh Kumar Goud: కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ వన్ అవుతుంది..
- కిషన్ రెడ్డి.. కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారు- మహేష్ కుమార్ గౌడ్
- తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు- పీసీసీ చీఫ్
- పదేళ్లుగా ప్రధాని దగ్గరికి వెళ్ళి.. తెలంగాణ నిధులపై చర్చ చేశారా..?- మహేష్ గౌడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్‌తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ మీద ప్రేమ ఉండొచ్చు.. కానీ అభివృద్ధి విషయంలో కాళ్ళు లాగే పని చేయొద్దని సూచించారు. పదేళ్లుగా ప్రధాని దగ్గరికి వెళ్ళి.. తెలంగాణ నిధులపై చర్చ చేశారా..? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకి ఏం ఇచ్చింది అంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పదవి ఇచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ నెంబర్ వన్ అవుతుందని అన్నారు.
Read Also: BNS Srinivas: తెలుగు వారి కోసం ప్రపంచ నిపుణుల జ్ఞానాన్ని అందిస్తున్న మార్గదర్శి
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
మరోవైపు.. మూసీ ప్రక్షాళనకి మద్దతు లేదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ట్రిపుల్ ఆర్ వద్దా..? స్కిల్ యూనివర్సిటీ వద్దా..? అని అన్నారు. కేసీఆర్ కులంకి చెందిన రామ్మోహన్ నాయుడిని.. తెలంగాణకి తీసుకు వచ్చి కేసీఆర్‌ను పొగిడే పని చేశారు కిషన్ రెడ్డి అని అన్నారు. ఎయిర్ పోర్టులు ఎవరిస్తారు.. సీఎం రేవంత్ మోడీని ఎన్ని సార్లు అడిగితే ఇచ్చారు ఎయిర్ట్ పోర్ట్ అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి.. మీరు తెలంగాణ బిడ్డ కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. పట్టించుకుని ముందుకు వెళ్ళాలి అనుకునే రేవంత్ రెడ్డిని అడ్డుకుంటున్నారు.. అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్, కిషన్ రెడ్డిలను ప్రజలు గమనిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Read Also: IND vs AUS: సెమీ ఫైనల్స్‌లో భారత్ vs ఆస్ట్రేలియా.. పైచేయి సాధించేదెవరో!
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!