ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సినీ నటి విజయశాంతి పేర్లను ప్రకటించింది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలో.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గెతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థు ఎంపికపై ఇప్పటికే పార్టీలో పలువురు సీనియర్ నేతలతో సమావేశమైన మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్..ఏఐసీసీకి పేర్లను అందించారు. ఈ మేరకు అధిష్టానం అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సినీ నటి విజయశాంతి పేర్లు ఫైనల్ చేసింది. అద్దంకి దయాకర్ .. సీఎం కోటా, శంకర్ నాయక్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జానారెడ్డి కోటా.. విజయశాంతిని అధిష్టానం కోటా కింద ఖరారు చేశారు.
సీపీఐ కి సీటు ఇవ్వాలని పిసిసి చీఫ్ మహేష్.. సిఎం రేవంత్ సిఫార్సు
READ MORE: Best Recharge Plans: 90 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్స్.. జియో హాట్‌స్టార్ ఉచితం
కాగా.. రాష్ట్రంలో ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు సోమవారం(మార్చి 10)తో ముగియనుంది. ఇప్పటివరకు అధికార పార్టీల అభ్యర్థుల పేర్లు చివరి క్షణంలో విడుదల చేసింది. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లను అధికార కాంగ్రెస్, ఒక స్థానం ప్రతిపక్ష బీఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది.