కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగింది.. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పులు తడక అంటున్నారని దుయ్యబట్టారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇళ్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందని తెలిపారు.
Minister Seethakka : హైదరాబాద్ గాంధీ భవన్‌లో బుధవారం మంత్రి సీతక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినడం, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరై తమ వినతులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల వినతులను స్వీకరించడంతో పాటు, కొన్నింటిని సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె…
TPCC Mahesh Goud : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయ భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ…
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో హల్వా వేడుక.. కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు మాత్రమే హాజరవుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు…
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన పరిధిని దాటిన ప్రవర్తనతో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేసీఆర్ కౌశిక్‌రెడ్డిని అదుపులో ఉంచాలని సూచించారు. కొంపల్లి దేవరయాంజాల్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం తగదని స్పష్టంచేశారు. దాడులు, దురుసుగా ప్రవర్తించడం తెలంగాణ సంస్కృతి కాదని,…
TPCC Mahesh Goud : బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిపైన టీపీసీసీ (TPCC) సీరియస్‌గా స్పందించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపట్టడం అవసరం అయినా, రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, యూత్ కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదని ఆయన అన్నారు. CM Chandrababu: కుప్పం…
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి, రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు. Formula E Car Race…
తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీనే ఉండదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
TPCC Mahesh Kumar : జల్-జమీన్-జంగిల్ (నీరు, భూమి, అటవీ వనరులు) నినాదాన్ని ఆధారంగా తీసుకుని గిరిజనుల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఆదివారం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార హోటల్‌లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు.…