TPCC Mahesh Goud : బీజేపీ నేతలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, మనుస్మృతిని అమలు చేయాలనే కుట్రలో బిజేపీ నాయకత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. ‘‘జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్’’…
భగవంతుడు ఏదో కులంలో మన పుట్టుకకు అవకాశం ఇచ్చాడని, తాను గౌడ కులంలో జన్మించానని, అందుకు ఎంతో గర్విస్తున్నాను అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మనం పుట్టిన కులాన్ని గౌరవించాలి కానీ.. ఇతర కులాలను తక్కువ చేయకూడదన్నారు. కుల వ్యవస్థ, కుల వృత్తులు లేనిదే దేశం లేదు అని.. కుల వృత్తులు అంతరించిపోకుండా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. గౌడ వృత్తిని గొప్ప వృత్తిగా చెప్పుకోవాలని, ప్రతిరోజు గౌడ్‌లు తాటి చెట్టు ఎక్కి దిగడం…
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్ కి వివరించాను.. అలాగే, వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని మనవి చేశాను.. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Mahesh Goud: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం మియాపూర్‌లోని సహాయా ఓల్డ్ ఏజ్ హోమ్ లో హృదయపూర్వకంగా నిర్వహించబడ్డాయి. వృద్ధుల మధ్య ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బరాజు, ఆయన స్నేహితుల బృందం సంయుక్తంగా నిర్వహించారు. మానవత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో సహాయా ఫౌండేషన్‌కు చెందిన లయన్ డాక్టర్ రఘు, లయన్ డాక్టర్ నీలూ ముఖ్య అతిథులుగా హాజరై, మహేశ్…
Mahesh Goud : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్‌లో మంత్రివర్గ విస్తరణపై స్పందించిన ఆయన, ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సమీకరణాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారెంతైనా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఆలస్యం జరుగుతోందని అసహనం వ్యక్తం…
Congress : కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే…
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. తెలంగాణ ఫస్ట్ అండ్ చివరి విలన్ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. టైం వేదిక మీరే డిసైడ్ చేయండి.. చర్చకు ఎక్కడికి రమ్మన వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్? అంటూ సవాల్ విసిరారు. రజతోత్సవ సభలో…
Mahesh Goud : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కరాటే బ్లాక్ బెల్టు అందుకున్నారు. ఏకంగా మూడు గంటల పాటు టెస్టుల్లో పాల్గొని ఆయన ఈ ఘనత సాధించారు. మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయాల్లోనే కాకుండా కరాటేలో కూడా తన సత్తా ఏంటో ఈ సందర్భంగా చూపించేశారు. సాధారణంగా యంగ్ ఏజ్ లో ఉన్న వారికి కరాటే బెల్టు వస్తే పర్లేదు గానీ.. మహేశ్ గౌడ్ కు ఈ వయసులో కూడా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి…
బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు." కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరె కటికల పాత్ర ఉంది. బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడొ యాత్ర చేపట్టారు. బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కుల సర్వే జరగాలనేది రాహుల్ గాంధీ ఆశయం.
MLC Nominations: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్ దాఖలు చేసారు. Read Also: Minister Nadendla…