Meenakshi Natarajan: సాదాసీదాగా రైల్లో హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్!
- తెలంగాణకు ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్
- మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
- చీఫ్ గెస్టులుగా మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా రైల్లో ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గాంధీభవన్‌కు చేరుకున్నారు.
గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంకు మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీసు బేరర్లు సమావేశంలో పాల్గొననున్నారు. ఇన్‌చార్జి హోదాలో మీనాక్షి నటరాజన్ మొదటిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాంతో ఆమె ఏ విధంగా మాట్లాడనున్నారనే ఆసక్తి పార్టీ నేతల్లో నెలకొంది.
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ఈ సమావేశం మీనాక్షి నటరాజన్‌తో రాష్ట్ర నేతల పరిచయ కార్యక్రమం మాత్రమేనని, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. బీసీలకు తగిన న్యాయం చేయాలని పార్టీలోని బీసీ నేతలు మీనాక్షి నటరాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. మీటింగ్ అయిపోయిన వెంటనే ఏఐసీసీ కార్యదర్శి తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?