మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మంజార్సంబా-పటోడా హైవేపై తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు.
TTD Temple in Mumbai: దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిధులు, భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. ఇప్పుడు భూమి పూజకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 21న భారీ ఎత్తున ముంబైలో టీటీడీ ఆలయానికి భూమి పూజ చేపట్టాలని అధికారులు తలపెట్టారు. ఈ మేరకు పలు పార్టీలకు…
మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని కోఠార్ణే గ్రామంలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలో ముంబైలోని శివాజీ నగర్ బైగన్వాడి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం నలుగురు శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకాలో గల కడ్బన్వాడి గ్రామంలో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఒక ట్రైనీ విమానం వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ శిక్షణలో ఉన్న 22 ఏళ్ల భావికా రాఠోడ్ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది.
ప్రతీ ఏడాది ఉల్లి ధరలు సామాన్యుడికి కంట తడి పెట్టిస్తుంటాయి. కొన్ని సార్లు కిలో ఉల్లి ధర ఏకంగా రూ.100ను దాటి పోతుంది. దీంతో సామాన్యుడిపై విపరీత భారం పడుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఉల్లి ధరల గురించి ప్రజలు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉల్లి ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. దీంతో ఇప్పటి వరకు…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు, నదులు పోటెత్తుతున్నాయి.. చాలా మంది వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు.. ఆయా రాష్ట్రాలు వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయాయి.. తెలుగు రాష్ట్రాలను ఇంకా వరదలు వీడడం లేదు.. వర్షాలు తగ్గుముఖం పట్టినా.. గోదావరి ఉధృతి ఇంకా తగ్గలేదు.. అయితే, వరదల్లో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు యువకులు,…
దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరంతో పాటు మధ్య భారతంలోని ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఈ రోజు 8 రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 22 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా వరద పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లలోని 31 డ్యామ్లకు వరద…
A seven-year-old girl has been found infected with Zika virus in Maharashtra's Palghar district, the state health department said on Wednesday. Prior to this, the first-ever patient was found in Pune in July last year.