సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ బయల్దేరిందంటే.. గమ్యం చేరుకునేవరకు ఎక్కడా ఆగే పరిస్థితి ఉండదు.. ఇక, అర్ధరాత్రి సమయంలో అయితే.. ఆ ఛాన్స్ లేదనే చెప్పాలి.. కానీ, కొన్నా సార్లు తోటివారికి సాయం చేసి మానత్వం చాటుకున్న ముఖ్యమంత్రులు కూడా లేకపోలేదు.. ఇప్పుడా కోవలో చేరిపోయారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ లగ్జరీ కారులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో.. అటుగా వెళ్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కాన్వాయ్..…
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో 14 మంది నీటిలో మునిగి మరణించారని పోలీసులు వెల్లడించారు.
కస్టమర్‌కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు వేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Beautification of Yakub Memon's grave.. CM Eknath Shinde ordered the investigation: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ సమాధిని సుందరీకరించడంపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై సీఎం ఏక్ నాథ్ షిండే విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంపై విచారాణ చేసి నివేదిక సమర్పించాలని ముంబై పోలీసులను సీఎం ఆదేశించారు. గత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హయాంలో యాకుబ్ మెమన్ సమాధిని సుందరీకరించడంపై…
Home Minister Security Breach: మహారాష్ట్రలో హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో లోపం ఏర్పడింది. ఓ వ్యక్తి హోం మంత్రి భద్రతను ఉల్లంఘించాడు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వెళ్లారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అయితే ఆ సమయంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హోంశాఖ అధికారిగా నటిస్తూ.. నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతూ అమిత్…
టీవీ విషయంలో జరిగిన అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవ.. అత్తగారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. టీవీ పెద్దగా శబ్ధం వస్తోందని అత్తగారు ఆఫ్ చేయగా.. టీవీ చూస్తున్న కోడలు కోపంతో అత్తగారి వేళ్లను కొరికేసిన ఘటన మహరాష్ట్రలో థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో చోటుచేసుకుంది.
పత్రాచల్ భూ కుంభకోణానికి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు సెప్టెంబరు 19 వరకు పొడిగిస్తూ ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఎ) కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు. ముంబైలో రోడ్డుప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సూర్య నది చరోటి వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
khaki Ganpati In Mumbai: వినాయక చవితి వేడుకల్లో వివిధ రుపాల్లో గణనాథుడు కొలువవుతున్నాడు. భక్తులు తమకు నచ్చిన స్టైల్లో వినాయకులను ప్రతిష్టించారు. ఇటీవల పుష్ఫ రాజ్ తరహాలో తగ్గేదే లేదనే స్టైల్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం చూశాం. తాజాగా ముంబై పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఓ వైపు భక్తితో పాటు ప్రజలకు సందేశాన్ని ఇచ్చే విధంగా ‘‘ ఖాకీ గణపతి’’ని ప్రతిష్టించారు.
మహారాష్ట్ర ముంబైలోని బోరివాలిలో ఇవాళ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. బోరివాలి వెస్ట్‌లోని సాయిబాబా నగర్లో భవనం కుప్పకూలగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని తనిఖీ చేపట్టారు.