Maharahtra: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో కొంత మంది వ్యక్తులు సాధువులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు సాధువుల్లో ఒకరి ఆధార్ కార్డును తనిఖీ చేయడంతో వారు అతనిని కారులో నుండి కాలుతో లాగడానికి ప్రయత్నించారు. అనంతరం బెల్టుతో అతడిపై దాడి చేశారు. వీడియోలో ఒక కిరాణ దుకాణం వెలుపల కొందరూ సాధువులను కొట్టడం కనిపించింది. దీనికి సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు సాధువులు కర్ణాటకలోని బీజాపూర్ నుంచి ఆలయ పట్టణం పండర్‌పూర్‌కు వెళుతుండగా ఓ బాలుడిని దారి అడిగారు, ఈ నేపథ్యంలో వారు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాకు చెందినవారని స్థానికులు అనుమానించి దాడికి పాల్పడ్డారు. సాధువులు లవణ గ్రామంలోని ఒక దేవాలయం వద్ద ఆగి తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని నివేదిక పేర్కొంది. సాధువులు ఉత్తరప్రదేశ్‌లోని ‘అఖాడా’ సభ్యులని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాధువులను ఆస్పత్రికి తరలించారు. కానీ పోలీసులు మాత్రం ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వీడియోని పరిసీలించి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. “పోలీసులు ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించారు. అల్లర్లకు సంబంధించిన నేరాన్ని నమోదు చేసారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది” సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడం చెప్పారు.
Jacqueline Fernandez: 200 కోట్ల దోపిడీ కేసు.. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ప్రశ్నల వర్షం
మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఈ ఘటనను ఖండిస్తూ, సాధువులపై ఇలాంటి అనుచిత ప్రవర్తనను రాష్ట్ర ప్రభుత్వం సహించదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వీడియో సందేశంలో తెలిపారు.”పాల్ఘర్‌లో సాధువుల హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం వారికి అన్యాయం చేసింది. కానీ ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సాధువుపై ఎలాంటి అన్యాయాన్ని అనుమతించదు” అని 2020 సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన అన్నారు.
శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈ సంఘటనను దురదృష్టకరం అని పేర్కొంది. ఎంత మంది బీజేపీ నాయకులు సాంగ్లీని సందర్శిస్తారో తెలుసుకోవాలని కోరింది. ఈ దాడిని సాధువులను హత్య చేసే ప్రయత్నమని అధికార ప్రతినిధి ఆనంద్ దూబే పేర్కొంటూ, ప్రభుత్వం హిందువులతో ఉందో లేదో స్పష్టం చేయాలని లేదా వారు హిందువాది అని నటించడం మానేయాలని అన్నారు.