Maharashtra: మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లాలో గత 45 రోజులుగా జరుగుతున్న ఓ తండ్రి పోరాటాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. మా కూతురిపై అత్యాచారం చేశారని.. అనంతరం హత్య జరిగిందని మృతురాలి తండ్రి బోరున విలపించారు. తమ కూతురి హత్యను ఆత్మహత్యగా చూపించారని.. ఈ సమాచారం తప్పని, ఆమెను హింసించిన హంతకులను అరెస్ట్ చేయాలని.. ‘నా కూతురికి న్యాయం చేయండి’ అంటూ గత నెలన్నర రోజులుగా రోదిస్తున్న తండ్రిని పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. కానీ బాధితురాలి తండ్రి వదల్లేదు. తనకు న్యాయం జరిగే వరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయబోనని మృతురాలి తండ్రి తేల్చిచెప్పారు.
హతురాలి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ధడ్‌గావ్ ప్రాంతంలో ఆగస్టు 1న కొందరు వ్యక్తులు బాధితురాలిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. ఆ తర్వాత.. వావి ప్రాంతంలోని మామిడిచెట్టుకు ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు కుటుంబసభ్యులకు ఫోను వచ్చింది. ఘటనాస్థలికి తాము చేరుకునేలోపే నిందితులు.. మృతదేహాన్ని కిందకు దించి సాక్ష్యాలను ధ్వంసం చేశారని హతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెపై రంజిత్, అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని తాము పోలీసులకు చెబుతున్నా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.
Ap Crime: కుమార్తెకు తన పోలికలు రాలేదని.. తండ్రి దాష్టీకం
ఆయన తన కుమార్తె మృతదేహాన్ని గత 45 రోజులుగా ఉప్పులో పాతిపెట్టాడు. అంతిమంగా వారి పోరాటాన్ని పాలకవర్గం గమనించింది. ఆరోగ్య బృందంతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. సంబంధిత సంఘటన నందుర్‌బార్‌లోని ధడ్‌గావ్ తాలూకాలో జరిగింది. తన కుమార్తెపై అత్యాచారం చేసి చంపేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. తన కుమార్తె మృతదేహానికి పోస్టుమార్టం ముంబైలోనే నిర్వహించాలని ఆయన అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. తండ్రి డిమాండ్‌కు గ్రామస్తులు కూడా మద్దతు పలికారు. బాధితురాలి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు, ఇప్పుడు ఆమె మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేయనున్నారు. మృతి చెందిన బాలిక మృతదేహంపై ముంబైకి చెందిన జేజే ఆసుపత్రిలో మళ్లీ శవపరీక్ష జరిగింది. ఆరోగ్య యంత్రాంగం సాయంతో ముంబైలో మళ్లీ పోస్టుమార్టం ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. ఈ పోస్టుమార్టం రిపోర్టు అనంతరం ఈ కేసును పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.