మహారాష్ట్రలోని నాసిక్‌లోని కోశింపాడ గ్రామ ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసితులు తమ బిందేలు నింపడానికి బావిలోకి దిగుతున్నారు.
Sharad Pawar: విపక్షాల ఐక్యత కోసం దేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు శరద్ పవార్. తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు.
మహారాష్ట్రలో BRS పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొదటి అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) ఎట్టకేలకు తొలి విజయం సాధించింది.
JP Nadda: ఉచితాలపై బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జపాన్, అమెరికా, చైనా దేశాలు ఉచితాలపై డబ్బులను ఖర్చు పెట్టాయని, ఇదే ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. భారతదేశం మాత్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని.. ఇది మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర సెక్టార్లకు బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు.
మహారాష్ట్రలోని అకోలాలో సోషల్ మీడియాలో పోస్ట్‌పై మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని శక్తులు ప్రేరేపిస్తున్నాయి అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామా చేయడం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ రోజు ఎన్సీపీ కోర్ కమిటీ ముంబైలో భేటీ అయింది. అయితే శరద్ పవారే ఎన్సీపీ అధినేతగా కొనసాగాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
NCP crisis: దేశరాజకీయాల్లో కీలక నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ) అధినేతగా ఉన్న శరద్ పవార్ ఆ పదవికి రాజీనామా చేశారు. అకాస్మత్తుగా ఆయన నిర్ణయం దేశాన్ని ఆశ్చర్యపరిచింది.
Sharad Pawar: ఎన్సీపీ నాయకుడు, సీనియర్ నేత శరద్ పవార్ తన ఆత్మకథలో సంచలన విషయాలను వెల్లడించారు. తన మరాఠీ ఆత్మకథ ‘లోక్ మాజే సంగతి’(ప్రజలు నాకు తోడుగా ఉన్నారు) పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ కేంద్రబిందువు అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని శరద్ పవార్ వెల్లడించారు. ఇతర పార్టీలతో వ్యవహరిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా జాతీయ పార్టీగా తన స్థాయిని గుర్తు తెచ్చుకుంటుదని…