Maharashtra: మహారాష్ట్రలో ఈ మధ్య కాలంలో కొన్ని పట్టణాల్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే తరచుగా గొడవలు జరగడానికి ఆయా పట్టణాలకు గతంలో ఉన్న పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడమే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఉన్న పేర్లను మార్చి కొత్త పేర్లను పట్టణాలకు పెట్టడంతో రెండు వర్గాలకు చెందిన వారు గొడవ పడటం అదికాస్త మత కలహాలు మారడం పరిపాటిగా మారిపోయింది. గడచిన 3 నెలల్లో మహారాష్ట్రలోని 8 పట్టణాల్లో గొడవలు జరిగాయి. వీటికి ప్రధాన కారణం కేవలం గతలో ఉన్న పేర్లను మార్చడమేనని పేర్కొంటున్నారు.
Read also: Fish Medicine: నేడే చేప మందు పంపిణీ.. ప్రారంభించిన మంత్రి తలసాని
గడచిన మూడు నెలల్లో మహారాష్ట్రలోని 8 నగరాల్లో తరచూ ఉద్రికత్తలు, హింస చోటు చేసుకున్నాయి. శంభాజీ నగర్, అకోలా, షిగావ్, శెంగమ్నర్, జలగావ్, ముంబై, కోల్హాపూర్‌లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇవి చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కొల్హాపూర్‌లో చెలరేగిన ఉద్రికత్తల విషయమై పోలీసులకు, ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్‌కు చెందిన ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన తర్వాతే ఈ తరహా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని స్వయంగా పోలీసు వర్గాలే వెల్లడించాయి. ముంబైలోని మాల్‌వాణి ప్రాంతంలో, ఛత్రపతి శంభాజీ నగర్‌లో శ్రీరామనవమి సందర్భంగా హింస జరిగిందని పోలీసులు తెలిపారు.
Read also: Love Came To Painful : ప్రేమ ముసుగులో హత్యలు.. శ్రద్ధ నుండి సరస్వతి హత్య వరకు
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ముఖ్యమైన మత ఘర్షణలు
మార్చి 31, 2023 – శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి. పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి. పోలీసులు అరెస్ట్ చేసిన 76 మందిలో 9 మంది మైనర్లు.
మే 13, 2023 – సోషల్ మీడియా పోస్ట్ వల్ల అకోలాలో మత హింస. ఒకరి మృతి, 10 మందికి గాయాలు. వంద మంది అరెస్ట్.
మే 14, 2023 –షిగావ్ (అహ్మద్‌నగర్)లో ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మత ఉద్రిక్తతలు. 150 మందిపై కేసు నమోదు, 30 మంది అరెస్ట్.
మే 14, 2023 – త్రయంబకేశ్వర్‌లో మత ఉద్రిక్తతలు. నలుగురి అరెస్ట్. విచారణ కోసం సిట్ ఏర్పాటు.
జూన్ 6, 2023 – లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా శెంగమ్నర్‌లో ర్యాలీ. సమనాపూర్ గ్రామంలో రాళ్ల దాడి.
జూన్ 7, 2023 – మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తించిన పోస్టింగ్‌పై కొల్హాపూర్‌లో హింసాత్మక ఘటనలు.