గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ ( 89 ) ఇవాళ ( మంగళవరం ) తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని తెలుస్తోంది.
Building Collapse: మహారాష్ట్రలో ఘోరం చోటు చేసుకుంది. థానే జిల్లా భివాండి ప్రాంతంలో పాత భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. వారిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భూకంపం వస్తుందా? అంటే తాజా పరిస్థితిని బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కూటమి- ఎన్డీయేలో అనూహ్య మార్పు రావచ్చు. మూలాల ప్రకారం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవిని సీఎం ఏక్నాథ్ షిండేతో మార్చుకోవచ్చు.
Cyber Fraud: మహారాష్ట్ర థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన టికెట్ క్యాన్సలేషన్ తర్వాత రీఫండ్ కోసం గూగుల్ సెర్చ్ చేశారు. అయితే ఆ తరువాత దాదాపుగా రూ. 5 లక్షలు సైబర్ మోసంలో కోల్పోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితుడు, అతని స్నేహితుడు కెన్యాలోని మొసాంబా నగారాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే దీని కోసం కెన్యా రాజధాని నైరోబీ నుంచి రిటర్న్ టి
Woman In Hijab Harassed: మహారాష్ట్ర ఔరంగాబాద్ దుర్మార్గమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు వేధింపులకు గురి చేశారు. సదరు అమ్మాయి హిందూ యువకుడితో తిరుగుతోందని అనుమానించిన వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ గా మారడంతో పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఔరంగాబాద్ నగరంలోని బేగంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మకై గేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ ట్రక్కు అకస్మాత్తుగా పెట్రోల్ పంప్ లోకి దూసుకెళ్లింది. హైవేపై ఓ ట్రక్కు పెట్రోల్ పంప్‌ను ఢీకొట్టింది. మహారాష్ట్రలోని పూణె-సతారా హైవేపై చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పొల్చితే ఇవాళ నమోదు అయిన కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10,112 నమోదు కాగా, సోమవారం (ఏప్రిల్ 24) భారతదేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 7,178 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ భారీ జనసమీకరణతో ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
MP Sanjay Raut : మరో 15రోజుల్లో మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందన్నారు.