Giriraj Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై విరుచుకుపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర కొల్హాపూర్ ఘర్షణ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓవైసీ విమర్శలు గుప్పించారు.
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శనివారం కీలక ప్రకటన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లను నియమించారు. సుప్రియా సూలే, శరద్ పవార్ కుమార్తె, ప్రస్తుతం ఈమె బారామతి నుంచి ఎంపీగా ఉన్నారు. పార్టీ 25వ వార్షికోత్సవంలో శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు.
Asaduddin Owaisi: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లపై ఓ వర్గం అనుకూల సోషల్ మీడియా పోస్టులు మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
మహారాష్ట్రలో ఈ మధ్య కాలంలో కొన్ని పట్టణాల్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే తరచుగా గొడవలు జరగడానికి ఆయా పట్టణాలకు గతంలో ఉన్న పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడమే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పార్లమెంట్ సంబంధిత వ్యవహారాలపై చర్చ చాలా ముఖ్యమని, కానీ రాను రాను ఈ సంప్రదాయం క్షీణిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. నూతన పార్లమెంటు భవనం గురించి రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన అన్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రోజుల్లో ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. సొంత వాళ్లను హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు కొంత మంది దుర్మార్గులు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో బస్సును, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. నాగ్‌పూర్ నుంచి నాగ్‌భిడ్‌కు కారులో ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా…
టీమిండియా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు, మహారాష్ట్ర మాజీ క్రికెటర్ ఉత్కర్ష పవార్‌ను రుతు గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు.