Aurangzeb Picture: వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఔరంగజేబు ఫొటో.. నవీ ముంబై వ్యక్తి అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aurangzeb Picture: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై నవీ ముంబై పోలీసులు ఒక వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సమస్యను ఒక హిందూ సంస్థ లేవనెత్తిందని ఆదివారం ఒక అధికారి తెలిపారు. నిందితుడు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్నాడు.ఔరంగజేబ్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై హిందూ సంస్థ సభ్యుడు అమర్జీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 298, 153 ఎ కింద నవీ ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించి విడుదల చేశారు.ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టడంపై కొల్హాపూర్‌లో నిరసనలు చెలరేగాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్‌లను కీర్తించడంపై మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో మతపరమైన ఉద్రిక్తత సంఘటనలు చెలరేగాయి.ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది. కొల్హాపూర్ నగరంలోని కొన్ని మితవాద సంస్థల ప్రజలు జూన్ 7వతేదీన కొల్హాపూర్ బంద్‌నకు పిలుపునిచ్చారు.ఈ బంద్ హింసాత్మక నిరసనలకు దారితీసింది. మా మరాఠా భూమిపై మొఘల్ నాయకులను కీర్తించడాన్ని మేం సహించమని.. హిందూ సమాజం పరిరక్షణ కోసం కత్తులు దూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. దీన్ని సహించేది లేదని అని హిందూ సంఘాల నేతలు ప్రకటించారు.
Also Read: Silvio Berlusconi: ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కన్నుమూత
అంతకుముందు అహ్మద్‌నగర్‌లో ఊరేగింపులో ఔరంగజేబు ఫోటోలను ప్రదర్శించారు. సంగమ్‌నేర్ పట్టణంలో, బాలుడి హత్యకు ప్రతిగా సకల్ హిందూ సమాజ్ ర్యాలీలో రాళ్లు రువ్వబడ్డాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడగా, ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. విడిగా, సంగమ్‌నేర్‌లో కూడా మతపరమైన ఊరేగింపు సందర్భంగా అభ్యంతరకరమైన నినాదాలతో ఔరంగజేబు పోస్టర్ ప్రదర్శించబడిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..