Sharad Pawar: ఈ ఏడాది చివర్లో అక్టోబర్-నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి(ఏంవీఏ) సిద్ధం అవుతున్నాయి.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఇండియా కూటమి మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది.
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో 46 ఏళ్ల డాక్టర్, ఆయన టీనేజ్ కుమార్తెకు జికా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బుధవారం ఒక అధికారి తెలిపారు. ఆ వైద్యుడికి ఇటీవల జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే ఈ వస్తువు ప్రపంచాన్నే మన ముందుకు తెస్తోంది. రైలు టికెట్ బుకింగ్ నుంచి బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ వరకు ప్రతీ పనిని స్మార్ట్ ఫోన్‌తో చేసే రోజులు వచ్చేశాయ్. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా అవసరానికి ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక వ్యసనంలా మారుతోంది. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన…
Suryakanta Patil: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబరిచిన బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి సూర్యకాంత పాటిల్ కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. గత 10 ఏళ్లలో తానను చాలా నేర్చుకున్నానని, ఇందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె రాజీనామా తర్వాత అన్నారు.
మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీస్‌స్టేషన్‌పై గుంపు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Car Crash : మహారాష్ట్ర (Maharashtra) లోని నాగ్‌పూర్ (Nagpur) లో ఆదివారం తెల్లవారుజామున వైద్య విద్యార్థుల బృందం నడుపుతున్న కారు ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న కార్మికుల గుంపు పైకి దూసుకెళ్లడంతో ఒక పిల్లవాడితో సహా ఇద్దరు మరణించారు. అలాగే ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. Viral News: బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. పోలీసులు భారీగా చలాన్ ఈ సంఘటన దిఘోరి నాకా సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. 20 – 22…
ఎవరైనా ఆప్తుల్ని కోల్పోతే.. ఆ కుటుంబంలో ఎంతో బాధ, దు:ఖం ఉంటుంది. కొన్ని రోజులు పాటు ఆ ఇల్లంతా విషాదంలో ఉంటుంది. ఇక బంధువులు, స్నేహితులు ఎవరైనా పరామర్శకు వస్తుంటే.. మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.