Maharashtra: దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా మహారాష్ట్రలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్లో నలుగురు మైనర్లు ఉన్నారు. నిందితులకు మరో బాలిక సహకరించినట్లు తేలింది.
Read Also: Madhya Pradesh: భర్త మద్యం తాగకుండా చేస్తానని, భార్యని రేప్ చేసిన తాంత్రికుడు..
అంబర్‌నాథ్ పట్టణంలోని 11 ఏళ్ల బాలికని మరో బాలిక తనతో రావాలని నిందితులు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లింది. ప్రధాన నిందితుడు బాలికపై ఆటోరిక్షాలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి ఎవరికి చెప్పొద్దని అతను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు కూడా మైనర్ అని పోలీసులు తెలిపారు.
బాలిక ఘటనాస్థలం నుంచి పారిపోయి, ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదైంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మైనర్‌తో పాటు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వయోజన నిందితులను పోలీసు కస్టడీలో ఉంచామని, మైనర్ నిందితులను రిఫార్మ్ హోమ్‌కు పంపామని అంబర్‌నాథ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్ కలస్కర్ తెలిపారు.