BJP: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడంతో అప్పటి నుంచి ఆ పార్టీలో గుబులు మొదలైంది. దీంతో రాష్ట్రాలలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను కమలం పార్టీ నిర్వహిస్తోంది. ఇందులో ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తున్నారు.. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మీటింగులు నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర నేతలతో పాటు కేంద్ర స్థాయి నేతలను కూడా పరిశీలకులుగా పంపుతుంది. ఇక, యూపీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఇలాంటి ఫలితాలను చూడాల్సి వచ్చిందన్న ఆసక్తికర ప్రశ్నలు కూడా ఈ సమావేశాల్లో లేవనెత్తుతున్నారు. ఈ సమావేశాల్లో 7 విషయాలు వెలుగులోకి వచ్చాయని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Read Also: Selfie Video: నవ దంపతులు ఆత్మహత్య.. ఎస్సై కి సెల్ఫీ వీడియో..!
కాగా, రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను అంతం చేస్తారని ప్రతిపక్షాలు పుకార్లు పుట్టించాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించిందన్నారు. ఇది కాకుండా మహారాష్ట్రలో కూడా సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా ఈ పుకార్ల వల్ల పార్టీకి తీవ్ర డ్యామేజ్ జరిగిందన్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ పుకార్లను ఎన్డీయే ఎదుర్కోలేకపోయిందని ఆయన అంగీకరించారు అని కమలం పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.
Read Also: JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు..! అది ఎలా..?
అయితే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం ఉందని బీజేపీ సమావేశాల్లో చెబుతున్నారు. రాజస్థాన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ప్రశ్న రాగా.. మాజీ సీఎం, ఎంపీ శివరాజ్ సింగ్ చౌహాన్, వినయ్ సహస్రబుద్ధే సమక్షంలో జరిగిన భేటీలో వెల్లడించారు. బీజేపీ, మోడీల పాలనను భారత్ నుంచి తొలగించాలని విదేశీ శక్తులు కోరుకుంటున్నాయి.. ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే విధమైన సమాధానం చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌ను పరాన్నజీవిగా అభివర్ణించారు. కాంగ్రెస్‌కు బలం లేదని, తోటి పార్టీల సహకారంతో అభివృద్ధి చెందిందన్నారు. యూపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పొత్తు వల్ల కాంగ్రెస్ ప్రయోజనం పొంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు రావడంతో సక్సెస్ అయిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.