కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
Instagram Love : ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి కొంపముంచింది. బెంగళూరులో ఇన్ స్టాలో ప్రేమ పేరుతో రూబియా(22)కు మహారాష్ట్రకి చెందిన మన్వర్(28) పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 8 నెలల పాటు బెంగళూరులో యువతితో మన్వర్ సహజీవనం చేశాడు. అయితే.. 10 రోజుల క్రితం బెంగళూరులో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న మన్వర్ తల్లితండ్రుల వద్దకి వచ్చారు జంట. మన్వర్ తల్లిదండ్రులు ఒప్పుకోకొకపోవడంతో ఇంట్లో గొడవ జరిగింది. భర్త మన్వర్ కూడా…
మహాయుతి కూటమిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎం ఆలయాన్ని నిర్మిస్తామని తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రకటించాలని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఆదివారం (డిసెంబర్ 15)న నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రమాణ స్వీకారోత్సవంతో తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. దాదాపు 30 మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది.
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి 233 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. విపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణ పరాజయం పాలైంది. ఈ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఉద్ధవ్ శివసేన 20, ఎన్సీపీ శరద్ పవార్ 10, కాంగ్రెస్ 16 సీట్లను…
Tiger Corridor : కాగజ్ నగర్ డివిజన్ అడవుల్లో టైగర్ కారిడార్‌కు అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ఎం డోబ్రియాల్ ఇటీవల జిల్లాకు మూడు రోజుల పాటు పర్యటించడం వల్ల టైగర్ కారిడార్ ప్రతిపాదనను వేగవంతం చేయడమే కాకుండా స్థానిక గ్రామస్తుల్లో భయం కూడా నెలకొంది. కాగజ్‌నగర్ అడవుల్లో త్వరలో కారిడార్ ఏర్పాటు చేస్తామని డోబ్రియాల్ ప్రకటించినప్పటికీ వివరాలు వెల్లడించలేదు. టైగర్ కారిడార్ అంటే ఏమిటి? అటవీ…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన శరద్ పవార్ పార్టీకి మరో షాక్ తగిలేటట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. మహాయుతి కూటమిలోకి వెళ్లేపోయే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.