Satish Wagh: వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!
- వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ
- మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసు
- నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ తిలేకర్ మామ సతీష్ వాఘ్ హత్య కేసు మిస్టరీ వీడింది. డిసెంబర్ 9న మర్డర్‌కు గురైన సతీష్ వాఘ్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని ఛేదించారు. విచారణలో సంచలన విషయాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. కలకాలం తోడుండాల్సిన అర్ధాంగే ఈ హత్యకు సూత్రధారి, పాత్రధారి అని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రియుడితో సుఖానికి అడ్డొస్తున్నాడని.. మరణశాసనం రాసి.. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసింది దుర్మార్గురాలైన భార్య. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సతీష్ వాఘ్(55).. మోహిని వాఘ్ (48) భార్యాభర్తలు. అయితే సతీష్ వాఘ్ ఇంట్లో అక్షయ్ జవాల్కర్ ( 29) అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. ఆ సమయంలో అక్షయ్ జవాల్కర్‌తో మోహిని వాఘ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడితో జల్సాలు చేస్తోంది. అయితే ఒకరోజు అక్షయ్ జవాల్కర్-మోహిని వాఘ్ బాగోతం.. సతీష్ వాఘ్ కంటిలో పడి మందలించాడు. అంతేకాకుండా మోహిని వాఘ్‌ను కొట్టడం కూడా చేశాడు. అయినా కూడా ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదు. అక్షయ్ జవాల్కర్.. వేరే ఇంటికి మారిపోయినా కూడా అతడితో మోహిని వాఘ్ శారీరక సంబంధం కొనసాగిస్తూనే ఉంది. నిత్యం ప్రియుడితో ఫోన్‌లో టచ్‌లోనే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా సతీష్ వాఘ్ తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో తన సుఖానికి భర్త సతీష్ వాఘ్ అడ్డొస్తున్నాడని చంపేయాలని కుట్ర పన్నింది. అంతే తడువుగా ప్రియుడితో కలిసి కోటి రూపాయులకు కిరాయి హంతకులను పురమాయించింది. అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు చెల్లించారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
అయితే ఈ నెల 9న సతీష్ వాఘ్.. సాధారణంగా ఎప్పటిలాగానే వార్నింగ్ వాక్ వెళ్లారు. అయితే ఐదుగురు వ్యక్తులు అమాంతంగా దాడి చేసి కారులో తీసుకెళ్లిపోయారు. అనంతరం 72 సార్లు కత్తిపొడిచి చంపేశారు. పూణె-సోలాపూర్‌లోని షిందావనే ఘాట్‌లోని ఉరులి కంచన్ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మోహిని వాఘ్‌ను తమదైన శైలిలో విచారించగా మిస్టరీ బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు అక్షయ్ జవాల్కర్‌ను అదుపులోకి తీసుకోగా.. మోహిని వాఘ్ చంపమంటేనే చంపినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. మోహిని వాఘ్, జవాల్కర్‌లతో పాటు పవన్ శ్యాంసుందర్ శర్మ (30), నవనాథ్ అర్జున్ గుర్సాలే (31), వికాస్ సీతారామ్ షిండే (28), అతిష్ జాదవ్‌లను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. మొత్తానికి భార్య పన్నాగానికి భర్త బలైపోయాడు.
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!