మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ కారులో కూర్చున్న 6 ఏళ్ల బాలుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఎస్‌యూవీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు డ్రైవర్ కాస్మెటిక్ సర్జన్‌గా గుర్తించారు. అజాగ్రత్తగా వాహనం నడిపిన అతడిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న మరికొందరు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే..
READ MORE:Bandi Sanjay : రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా
6 ఏళ్ల హర్ష మావ్జీ అనే బాలుడు.. మారుతి వ్యాగన్ఆర్ కారు ముందు సీటులో కూర్చున్నాడు. తండ్రి కారు నడుపుతున్నాడు. వెనకాల మరో ఇద్దరు కూర్చున్నారు. వీళ్ల కారుకు ముందు ఓ ఎస్‌యూవీ వెళ్తోంది. అకస్మాత్తుగా ముందు వెళ్తున్న ఎస్‌యూవీ డివైడర్‌ను ఢీకొని గాలిలోకి ఎగిరింది. ఈ బాలుడి కుటుంబం ప్రయాణిస్తున్న మారుతి వ్యాగన్ఆర్ బాడెట్‌ను కూడా ఢీకొంది. దీంతో వెంటనే కారులోని ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంది. ఈ ప్రమాదం తర్వాత.. హర్షను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్ష శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. అంతర్గత గాయాల కారణంగా మరణించినట్లు తెలిపారు. ఎయిర్ బ్యాగ్ తెరుచుకునే క్రమంలో బాలుడిని బలంగా ఢీకొట్టడంతో మరణించినట్లు తేలింది. కారులో కూర్చున్న మరో ముగ్గురుకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీ కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. తన పిల్లలు పానీపూరీ తినాలని పట్టుబడటంతో బయటకు తీసుకెళ్లినట్లు తండ్రి తెలిపాడు. అంతలోనే ఇలా జరిగిందని వాపోయాడు. కాగా.. మంగళవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
READ MORE: IND vs AUS: బాక్సింగ్ డే టెస్టులో నితీష్ ఔట్..! ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందంటే..?