మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ ఓ క్రీడాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్య పరిచింది. జల్నాలోని డాక్టర్ ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'క్రిస్మస్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్'లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆట ఆడుతూడగా.. మైదానంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.
మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ తిలేకర్ మామ సతీష్ వాఘ్ హత్య కేసు మిస్టరీ వీడింది. డిసెంబర్ 9న మర్డర్‌కు గురైన సతీష్ వాఘ్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని ఛేదించారు.
Maharashtra: మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం నెలకు రూ. 13,000. అయితే, తన గర్ల్‌ఫ్రెండ్‌కి మాత్రం బీఎండబ్ల్యూ కారు, 4BHK ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వం నుంచే రూ. 21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంత లగ్జరీ లైఫ్‌స్టైల్ ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ కారులో కూర్చున్న 6 ఏళ్ల బాలుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఎస్యూవీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు డ్రైవర్ కాస్మెటిక్ సర్జన్‌గా గుర్తించారు. అజాగ్రత్తగా వాహనం నడిపిన అతడిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న మరికొందరు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే..
మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఒక్కసారిగా విష సర్పం బయటకు వచ్చింది. కోర్టులోని ఫైళ్ల గుట్టలోంచి పాము రావడంతో కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. కోర్టు హాలులో ఉన్నవారంతా పాము భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ముంబైలోని ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
Ramtek bungalow: మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, శివసేన ఏక్నాథ్ షిండేల ‘‘మహాయుతి’’ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు మంత్రులు నియామకం కూడా జరిగింది.
Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓటర్ సంఖ్య గణాంకాలలో లేదా ఓటర్ బాబితా నుంచి ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు చేయలేదని ఈసీ చెప్పింది. అక్టోబర్ 19న మహారాష్ట్ర ప్రతిపక్ష ‘‘మహా వికాస్ అఘాడీ’’ పలు అంశాలపై ఎన్నికల కమిషన్ని కలిసింది. సాయంత్రం 5 గంటల ఓటింగ్ శాతం, తుది గణాంకాల్లో ఓటింగ్ శాతం మధ్య తేడాల గురించి ఈసీకి ఫిర్యాదు చేసింది.
వచ్చే ఏడాది జరగబోయే బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంవీఏ మిత్ర పక్షంతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని సూచనలు చేశారు.
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.
Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగిన భారత్ జోడో యాత్రలో "అర్బన్ నక్సల్స్" సంస్థలు పాల్గొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు చేశారు.