Maharashtra: క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బ్యాట్స్ మెన్ మృతి (వీడియో)
- క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లో కుప్పకూలిన క్రీడాకారుడు
- కొన్ని క్షణాల్లోనే మృతి
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ ఓ క్రీడాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్య పరిచింది. జల్నాలోని డాక్టర్ ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘క్రిస్మస్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్’లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆట ఆడుతూడగా.. మైదానంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.
READ MORE: Hyderabad: సెల్‌ఫోన్ వాడొద్దని మందలించిన తండ్రి.. కూతురు అదృశ్యం
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. క్రికెట్ మ్యాచ్‌లో ఆటగాడు బ్యాటింగ్ ఆడేందుకు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా పిచ్‌పై కూర్చున్నాడు. క్రమంగా అతని పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అక్కడున్న ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైందో గమనించే సరికే ఆ క్రీడాకారుడు మృతి చెందాడు. పోలీసులు, వైద్య బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఆటగాడిని ముంబైలోని నలసోపరా నివాసి విజయ్ పటేల్‌గా గుర్తించారు. అయితే.. విజయ్ పటేల్ మరణం వెనుక కారణాన్ని అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. కాగా.. అతను గుండెపోటు కారణంగా మరణించాడని ప్రాథమిక విచారణలో తేలింది.
READ MORE: SP Sindhu Sharma: ట్రై యాంగిల్ సూసైడ్ కేసులో ఎలాంటి ఐ విట్నెస్లు లేవు..
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఆట సమయంలో విజయ్ పటేల్ పూర్తిగా ఫిట్‌గా, ఉత్సాహంగా కనిపించాడు. అయితే.. అతను అకస్మాత్తుగా కిందపడి ఛాతీ నొప్పి తీవ్రంగా ఉందని తెలిపాడు.ఈ ఘటన జల్నాతో పాటు క్రికెట్ ప్రేమికులను కలిచివేసింది. విజయ్ పటేల్ అకాల మరణం పట్ల స్థానిక ప్రజలు, క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నిర్వాహక కమిటీ వెంటనే మ్యాచ్‌ను రద్దు చేసింది. విజయ్ పటేల్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది.
क्रिकेटपटू मैदानातच कोसळला, हार्टअटॅकने जागीच मृत्यू; जालना येथील घटना #jalana #Cricket #marathwada pic.twitter.com/zTRHBbr5Ul
— Lokmat Chhatrapati Sambhajinagar (@milokmatabd) December 30, 2024
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?