Maharashtra: కాంట్రాక్ట్ ఉద్యోగి రూ. 21 కోట్ల ఘరానా మోసం.. గర్ల్‌ఫ్రెండ్‌కి BMW కార్, 4 BHK ఫ్లాట్ గిఫ్ట్..
- సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘరానా మోసం..
- ప్రభుత్వం నుంచి రూ. 21 కోట్ల దొంగతనం..
- గర్ల్‌ఫ్రెండ్‌కి బీఎండబ్లూ కారు, విలాసవంతమైన ఫ్లాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం నెలకు రూ. 13,000. అయితే, తన గర్ల్‌ఫ్రెండ్‌కి మాత్రం బీఎండబ్ల్యూ కారు, 4BHK ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వం నుంచే రూ. 21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంత లగ్జరీ లైఫ్‌స్టైల్ ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుడు హర్ష్ కుమార్ క్షీరసాగర్ తనకు తెలిసిన మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వం నుంచి రూ. 21 కోట్ల 59 లక్షలు మోసం చేశారు. ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి శంభాజీనగర్‌లోని డిపార్ట్‌మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ డబ్బును స్వాహా చేశారు. దొంగిలించిన నిధులతో, నిందితుల్లో ఒకరు తన ప్రియురాలి కోసం ఎయిర్‌పోర్టుకు ఎదురుగా ఉండే విలాసవంతమైన 4 BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేశారు. ప్రియురాలి కోసం నగరంలోని ఒక నగల వ్యాపారి నుంచి వజ్రాలు పొదిగిన గాజులను ఇచ్చాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Read Also: Hyderabad Crime: బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారయత్నం.. నలుగురు అరెస్ట్
ఈ మోసంలో ప్రమేయం ఉన్న మరో మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ. 35 లక్షల విలువైన ఎస్‌యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ తన కారు తీసుకుని ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రభుత్వ నిధుల కోసం ఉద్దేశించిన ఇండియన్ బ్యాంక్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో అకౌంట్ తెరిచి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. లావాదేవీల కోసం డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం అవసరం. అయితే, కాంప్లెక్స్‌లోని కాంట్రాక్టు ఉద్యోగులైన హర్ష్‌కుమార్ క్షీరసాగర్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్‌లు బ్యాంకుకు అందజేసేందుకు కల్పిత పత్రాలను రూపొందించారు.నకిలీ పత్రాలను ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్టివేట్ చేసిన తర్వాత, వారు తమ ఖాతాలకు నిధులను బదిలీ చేశారు. డిపార్ట్‌మెంటల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరు నెలల తర్వాత మాత్రమే ఈ కుంభకోణాన్ని గుర్తించడం గమనార్హం.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!