50 Cars Punctured: మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి మహామార్గ్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సోమవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో మాలేగావ్, వనోజా టోల్ ప్లాజా మధ్య హైవేపై ఓ ఐరన్ బోర్డు ఒక్కసారిగా విరిగి కింద పడింది. దీంతో సుమారు 50కి పైగా ట్రక్కులు, కార్లు పంచర్ కావడంతో ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనింది. ఇక, వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించకపోవడంతో అర్ధరాత్రి వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read Also: Supreme Court: దల్లేవాల్కు వైద్యం అందించడానికి పంజాబ్ సర్కార్కి సుప్రీంకోర్టు మరింత సమయం..
కాగా, నాగ్‌పూర్-ముంబై మధ్య సమృద్ధి మహా మార్గ్‌ను నిర్మిస్తున్నారు. మొత్తం 701 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారిని ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కళల ప్రాజెక్టుగా చెబుతున్నారు. ఇప్పటికే, ఈ ఎక్స్‌ప్రెస్ వేలో రెండు దశల పనులు వేగంగా పూర్తయ్యాయి. దీంతో 600 కిలో మీటర్లు అందుబాటులోకి రాగా, డిజైన్ లోపాలతో హైవేపై తరచూ ప్రమాదాలు కొనసాగుతున్నాయి.