Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయనే భయంతో ప్రయాణికులు ట్రాక్‌పైకి దూకారు. అదే సమయంలో ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది అక్కడిక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ లాగడంతో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు భావించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Lebanon: హిజ్బుల్లా టాప్ కమాండర్ హమాది హతం.. ఇంట్లో ఉండగా కాల్చివేత
చైన్ లాగడంతో పొగలు వ్యాపించాయి. మంటలుగా భావించిన ప్రయాణికులు రైలు నుంచి పక్కనే ఉన్న ట్రాక్‌పై దూకారు. ట్రాక్ దాటే ప్రయత్నం చేస్తుండగా, అదే ట్రాక్‌పై వేగంగా వస్తున్న బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ప్రాణభయంతో ట్రాక్‌పై దూకడంతో అనుకోకుండా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్రేకులు వేయడంతో చక్రాల నుంచి పొగలు వచ్చాయి. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లక్నో నుంచి ముంబై వెళ్తోంది.