మహారాష్ట్రలోని షిర్డీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో కొండగడప గ్రామానికి చెందిన కొందరు రెండు రోజుల క్రితం సాయి బాబా దర్శనం కోసం షిర్డీకి వెళ్లారు. దర్శనం పూర్తి చేస్తుకుని తిరిగి సొంతూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురి అయింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Anupama : గ్లామర్ డోర్లు తెరిచిన అనుపమకి ఆఫర్లే ఆఫర్లు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ప్రేమలత(59), వైద్విక్ నందన్(6 నెలలు), అక్షిత(20), ప్రసన్న లక్ష్మీ(45)గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. దైవ దర్శనం కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో కొండగడప గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లా టాప్ ఆర్మీ జనరల్, పాక్ ఆర్మీ చీఫ్‌తో భేటీ.. ఇండియానే లక్ష్యమా..?