CM Chandrababu: వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్.. దావోస్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు..
- ఒకే వేదికపై ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు..
- వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్..
- మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ఉద్దేశించి బాబు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్ అంటూ.. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్నారు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ వెళ్లి.. వివిధ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమై.. తమ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు.. తమ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికసదుపాయాలు వివరిస్తూ.. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు.. అయితే, దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు..
Read Also: Minister Nara Lokesh: దావోస్‌లో బిజీబిజీ.. లోకేష్ వరుస భేటీలు
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ఇక, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రాగా.. గ్లోబల్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం.. రాష్ట్రాల ఆకాంక్ష ఏ విధంగా ఉంది అనే అంశాలపై చర్చించారు.. అయితే, ఈ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు.. వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్ అంటూ.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చూయిస్తూ కామెంట్లు చేశారు.. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. తెలంగాణ స్టేట్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ఇండియా అని పేర్కొన్న చంద్రబాబు.. వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్ అంటూ చమత్కరించారు.. దీంతో, ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?