మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు కూటమిల్లోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మహా వికాస్ అఘాడీ కూటమి డీలా పడింది. శివసేన (యూబీటీ) ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక మహాయుతిలో కూడా దాదాపుగా అవే పరిస్థితులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న ఆ పొత్తు.. లోకల్ ఎన్నికల్లోనూ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉండబోదని సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ విడివిడిగా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు అజిత్ పవార్ సన్నాహకాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jailer 2: ‘జైలర్ 2’ అనౌన్స్‌మెంట్ టీజర్.. మామూలుగా లేదుగా..!
ఎన్సీపీ నేతల సమాచారం ప్రకారం.. బీఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి తీసుకు వెళ్లే కీలక బాధ్యతలను ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌కు అప్పగించనున్నారు. సివిక్ పోల్స్ ఎలక్షన్ ఇన్‌చార్జిగా ఆయనను పార్టీ నియమించనుంది. తద్వారా ముంబైలో ఎన్సీపీ పట్టును పెంచుకోవాలనుకుంటోంది. మరోవైపు విపక్ష మహా వికాస్ అఘాడిలోనూ ప్రధాన పార్టీలు బీఎంసీ ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్నాయి. ఎంవీఏ కీలక భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఎన్‌సీపీ (ఎస్‌పీ), కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో చర్చలు ఉంటాయని శరద్ పవార్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Russia-India: రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మృతి.. భారతీయుల్ని విడుదల చేయాలన్న భారత్