మహారాష్ట్రలోని షిర్డీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
No Parking Space- No Car: రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని కంట్రోల్ చేయడానికి మహారాష్ట్ర సర్కార్ కొత్త ప్రతిపాదనను తెచ్చింది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే రూల్ అమలులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు కూటమిల్లోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మహా వికాస్ అఘాడీ కూటమి డీలా పడింది. శివసేన (యూబీటీ) ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది.
ఇండియా కూటమి దాదాపుగా చీలిపోయినట్లుగానే తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి పరిస్థితి మరింత దిగజారింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు.
Cyber Fraud Village : ఐదు రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిబ్బంది.. 23 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఈ అరెస్ట్‌ల వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడిస్తూ.. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండటంతో నిందితులను పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో 23 మంది సైబర్ నేరగాళ్ళని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలలో నిందితులు నేరాలకు పాల్పడినట్లు…
Maharashtra: మేనకోడలు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి భోజనంలో విషం కలిపాడు. అయితే, అక్కడ ఉన్న వారు చూసి పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆహారం ఎవరూ తినలేదని, పరీక్షల కోసం ఫుడ్ శాంపిల్స్ పంపాపని పోలీసులు బుధవారం తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
Shocking: మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో విషాదం నెలకొంది. 26వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్న జంట, అదే రోజు ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున మార్టిన్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి దస్తులు ధరించిన దంపుతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
HMPV Virus: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదు కాగా, తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి.
Bird flu: మహారాష్ట్ర నాగ్‌పూర్ సమీపంలోని గోరెవాడ రెస్క్యూ సెంటర్లో మూడు పులులు, ఒక చిరుతపులి మరణించింది. బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఫ్లూ H5N1 వైరస్) సోకడంతో వన్యప్రాణులు మరణించాయి. డిసెంబర్ 2024 చివరలో ఈ మరణాలు నివేదించబడ్డాయి. దీంతో మహారాష్ట్ర అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మానవులు-వన్యప్రాణుల సంఘర్షణ సంఘటనల తర్వాత వీటిని డిసెంబర్లో చంద్రపూర్ నుంచి గోరెవాడకు తరలించారు.