Huge Blast: మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి!
- మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..
- ప్రమాదంలో ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు..
- భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Blast: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భండారా జిల్లాలోని జవహర్ నగర్ లో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రోజు (జనవరి 24) భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. నేటి ఉదయం 10.30 గంటల సమయంలో ఫ్యాక్టరీలోని ఆర్‌కే బ్రాంచ్ విభాగంలో పేలుడు సంభవించింది అని జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్తే పేర్కొన్నారు.
Read Also: Nandamuri Balakrishna : బాలయ్య సినిమాల లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
అయితే, పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు ఒక్కసారిగా కూలిపోగా.. ఈ శబ్దం దాదాపు 5 కిలో మీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకోగా.. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉండగా.. వీరిలో ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడినట్లు తెలుస్తుంది. అయినా, ఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇక, గాయపడిన వారిని అంబులెన్స్ ల ద్వారా స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందిస్తూ.. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు.
BREAKING
One killed in ordnance factory blast in Maharashtra's #Bhandara district, say police #Maharashtra #Blast #Fire pic.twitter.com/ZUOtnnj5pd
— Indian Observer (@ag_Journalist) January 24, 2025
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?