ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు.. 500 మంది రైతులకు దర్శన సౌకర్యం కల్పించనుంది టీటీడీ.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్‌లో శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు… కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. కాగా, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి మహా పాదయాత్ర ప్రారంభించిన…
అమరావతిని ఏకైక రాజధానిగా వుంచాలంటూ రైతులు, ప్రజాసంఘాలు మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొననున్నారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. పాదయాత్రలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరీ, సత్య కుమార్ పాల్గొని సంఘీభావం తెలపాలని నిర్ణయించారు. రాజధాని రైతులను కలిసి సంఘీభావం తెలుపుతామని ఏపీ బీజేపీ అగ్ర నేతలు ప్రకటించారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో రాజధాని రైతుల…
విజయనగరం జిల్లాలో చెరుకు రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. అయితే, పోలీసుల అడ్డంకులు కొనసాగుతున్నాయి. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్నది రైతులు కాదని, అసలు రైతులు తగినంత చెరకు పండించడం లేదంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి మాటలను ఖండిస్తూ నేడు మహాపాదయాత్రకు పిలుపునిచ్చారు రైతులు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం నుండి కలెక్టరేట్ వరకూ మహాపాదయాత్ర చేపడుతున్నారు రైతులు. రైతులకు నాయకత్వం వహిస్తున్న తమ్మినేని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.…
రాజధాని రైతుల పాదయాత్రలో లాఠీ ఛార్జ్ అప్రజాస్వామికం అన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతుల పాదయాత్రలో గాయాల పాలైనవారికి.. చేయి విరిగిన రైతుకు వైద్యం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై లాఠీ ఛార్జ్ చేయడం దురదృష్టకరం. మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. అదేమీ నేరం కాదు. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అన్నారు…
అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి ఇచ్చారు. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ అనుమతి ఇచ్చామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించవద్దని డీజీపీ…
ఏపీలో అమరావతి రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రాజధాని రైతులు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ న్యాయవాది. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించారు న్యాయవాది వి.లక్ష్మీనారాయణ. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది హైకోర్ట్. రైతుల…