వైసీపీ నేతలు, మంత్రులపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి మంత్రులు..ఎం.ఎల్.ఏ.లకు మతి పోతోందన్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి శంఖుస్థాపన చేసిన అమరావతి పై విమర్శలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని కడుతామంటే రైతులు భూములిచ్చారు..అమరావతికి శాసనసభలో అధికార…ప్రతిపక్షాలు అంగీకరించినందువల్లే రైతులు భూములిచ్చారు..అమరావతిలో రాజధాని కడుతామని చెప్పి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో. వై.సి.పి గెలిచింది.
ధర్మాన రాజీనామా కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి.. విశాఖలో సగానికి పైగా పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోయాయి.. 23 మంది ఎం.పి.లు ఉన్నారు కదా ..దమ్ముంటే విశాఖకు రైల్వే జోన్ తీసుకురండి.. మూడు రాజధానుల సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులు చూసుకొని మాట్లాడాలి. రైతుల పాదయాత్ర పై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు చంద్రమోహన్ రెడ్డి.
Read Also: Telangana VRA: VRAల నిరసనగళం.. MRO ఆఫీసులకు తాళాలు, నినాదాలు
రాజధాని కుప్పంలోనో, నారావారిపల్లిలోనో పెట్టుకుంటే ఏడ్చాలి. రాష్ట్ర నడిబొడ్డులో నిర్మిస్తున్న రాజధాని పై మీకున్న కష్టమేంటో చెప్పాలి..అమరావతికి అభివృద్ధికి సంబంధం లేదు..చంద్రబాబు హయాంలో వచ్చిన మూడు కేంద్ర సంస్థలు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు..ఇప్పటికే విశాఖలో భూకుంభకోణంలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగింది.ఈ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే మేలు అన్నట్టుంది..మంత్రులు రాజీనామా చేసి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోండి..మంత్రి రోజా జబర్దస్త్ లో మూడు రాజధానుల స్కిట్ వేయాలి.
Read Also: Atchannaidu: డైవర్షన్ పాలిటిక్స్ జగన్ కు అలవాటే