ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు.. 500 మంది రైతులకు దర్శన సౌకర్యం కల్పించనుంది టీటీడీ.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్‌లో శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు… కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. కాగా, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి మహా పాదయాత్ర ప్రారంభించిన అమరావతి రైతులు.. 44వ రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన రైతులు నిన్న తిరుపతికి చేరుకున్నారు.. మంగళవారం సాయంత్రం అలిపిరి వద్ద మహాపాదయాత్ర ముగిసిన సంగతి తెలిసిందే.. ఇక, ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్నారు.. వీరి దర్శనం కోసం ఏర్పాట్లు చేసింది టీటీడీ.