ఏపీలో మూడు రాజధానులు అంశం కీలకంగా మారింది. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు, మంత్రులు మూడురాజధానుల కోసం ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. ఈమధ్యే విశాఖలో భారీ స్థాయిలో విశాఖ గర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అనేది జగన్మోహన్ రెడ్డి విజన్ తో కూడిన ఆలోచన అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాజకీయంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆమె మండిపడ్డారు.
Read Also: WhatsApp: తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు.. ఊపిరిపీల్చుకున్న యూజర్లు..
ఉత్తరాంధ్ర ప్రజలకు మిగతా ప్రాంతాల ప్రజలకు మధ్య తగవులు పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అమరావతి అనేది కేవలం 29 గ్రామాలకు పరిమితమైనటువంటి ఒక రాజధాని, అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు అవసరం. రాష్ట్రంలో ఇంత సంక్షేమ అభివృద్ధి జరిపిస్తూ లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టే పరిస్థితిఉందా అని ప్రశ్నించారు పాముల పుష్పశ్రీవాణి. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగాలనే ఉద్దేశంతో అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా చేయబోతున్నాం అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అయ్యుండి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం అమరావతి రాజధానికి మద్దతు పలకడం దారుణం అని మండిపడ్డారు. ఇప్పటికే కొంత అభివృద్ధి చెందిన విశాఖను కొంత మేర ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్లయితే కొన్ని దశాబ్దాల్లో హైదరాబాద్ ను తలదన్నే రాజదాని అవుతుందన్నారు. మా పార్టీ విధానం , మా ప్రభుత్వ విధానం మూడు రాజదానులే అని ఆమె స్పష్టం చేశారు.
Read Also: Top Five Luxury Brands in the World: ప్రపంచంలోని టాప్ ఫైవ్ లగ్జరీ బ్రాండ్స్